telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

థియేటర్‌లో మద్యం తాగి హంగామా..యువకులను చితకబాధిన ఎస్ఐ

విశాఖ జిల్లాలో ఎస్ఐ చంద్రశేఖర్ మందుబాబులకు మంచి డోస్ ఇచ్చారు.మద్యం తాగి రచ్చ చేసిన ఇద్దరు యువకులను చితకబాదారు. చోడవరంలోని ఓ థియేటర్‌లో ఇద్దరు యువకులు మద్యం తాగి నానా హంగామా చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ థియేటర్‌కు వచ్చారు.

ఇద్దరు యువకులను థియేటర్ నుంచి బయటకు తీసుకువచ్చి చితకబాదారు. యువకులపై కేసు పెడితే భవిష్యత్ పాడవుతుందని, అందుకే మందలించి వదిలేసినట్లు ఎస్ఐ వివరణ ఇచ్చారు. ఎస్ఐ చితకబాదుడు సీసీకెమెరాల్లో మొత్తం రికార్డు అయింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Related posts