telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక సినిమా వార్తలు

సిరివెన్నెల సీతారామ శాస్త్రికి పద్మశ్రీ

Cine writer Sirivennela Padmasree Award

2019వ సంవత్సరానికి పౌర పురస్కారాలను కేంద్రప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నలుగురికి పద్మ విభూషణ్ ప్రకటించగా, 14 మందికి పద్మభూషణ్ అవార్డులు, 112 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో నలుగురికి ఈ ఏడాది పద్మశ్రీ అవార్డులు లభించాయి. వీరిలో ఇద్దరు ఆంధప్రదేశ్‌కు, ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు.

ఏపీ నుంచి ప్రముఖ చెస్‌ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, వ్యవసాయ రంగం నుంచి ఎడ్లపల్లి వేంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి సిరివెన్నెలతోపాటు భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ ఆటగాడు సునీల్‌ ఛెత్రిలను పద్మ శ్రీ వరించింది.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. కళలు, సాహిత్యం, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, పరిశ్రమలు, ఆరోగ్యం–వైద్యం, వర్తకం, క్రీడలు, సామాజిక సేవ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆయా రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖలను కేంద్రం పద్మ అవార్డులతో సత్కరించనుంది.

Related posts