telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

క్రిస్ గేల్‌ పై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చర్యలు

Gayle

క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (సీపీఎల్‌) ఫ్రాంచైజీ మార్పు విష‌యంలో స్టార్ ప్లేయ‌ర్ క్రిస్ గేల్‌-మాజీ బ్యాట్స్‌మ‌న్ రాం నరేశ్ శ‌ర్వాన్ మ‌ధ్య వివాదం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. జమైకా త‌ల్ల‌వాస్ టీమ్ నుంచి త‌న‌ను త‌ప్పించ‌డానికి కార‌ణం ఆ జ‌ట్టు కోచ్ శ‌ర్వానేన‌ని గేల్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న‌ను క‌రోనా వైర‌స్‌తో యూనివ‌ర్స్ బాస్ పోల్చాడు. త‌ర్వాత ఈ వివాదంపై శ‌ర్వాన్ వివ‌ర‌ణ కూడా ఇచ్చాడు. తాజాగా దీనిపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డ‌బ్ల్యూఐసీ) అధ్య‌క్షుడు రికీ స్కెరిట్ స్పందించారు. గేల్‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, అయితే అత‌ని కెరీర్‌కు ఇది ఎండ్ కాబోద‌ని స్కెరిట్ తెలిపారు. సీపీఎల్ గురించి అన‌వ‌స‌ర చ‌ర్చ గేల్ కార‌ణంగా వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే అద్భుతమైన కెరీర్ ఉన్న గేల్‌ను ఈ ప‌రిణామంతో జాతీయ జ‌ట్టు నుంచి దూరం చేయబోమ‌ని భ‌రోసా నిచ్చారు. మ‌రోవైపు క్రిస్ గేల్‌-శ‌ర్వాన్ వివాదం దురదృష్ట‌క‌ర‌మ‌ని స్కెరిట్ వ్యాఖ్యానించాడు. ‌నిజానికి అప్ప‌టికే మూడుసార్లు జమైక‌న్ త‌ల్ల‌వాస్ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించిన గేల్‌.. ఈ సీజ‌న్‌కు సంబంధించి సెయింట్ లూసియా జౌక్స్‌ టీమ్‌కు మారాడు. త‌ను తల్ల‌వాస్ వీడటం వెనుక శ‌ర్వాన్ కుట్ర చేశాడ‌ని, త‌నో పాములాంటి వ్య‌క్తని విమ‌ర్శించాడు.

Related posts