telugu navyamedia
crime political trending

మెహుల్ చోక్సీకి .. మరో షాక్ .. 24కోట్ల ఆస్తులు జప్తు..

chowki request suspended by court

వేల కోట్ల రూపాయాల రుణాలు ఎగవేసి ఆర్థిక నేరస్తుడిగా విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీకి చెందిన రూ.24.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. భారత్ సహా ఇతర దేశాల్లో ఉన్న చోక్సీ ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఇందులో దుబాయ్ కేంద్రంగా ఉన్న మూడు వాణిజ్య ఆస్తులు, ఒక మెర్సిడెస్ బెంజ్ కారు ఉన్నట్టు పేర్కొన్నారు.

ఇప్పటి వరకు జప్తు చేసిన ఆస్తుల మొత్తం రూ.25347 కోట్లని వివరించారు. గతేడాది పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.13 వేల కోట్ల రుణాలు తీసుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలో దేశం విడిచి పరారయ్యారు. చోక్సీ ప్రస్తుతం అంటిగ్వాలో తలదాచుకున్నాడు. అతడిని భారత్‌కు రప్పించేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

Related posts

కరెంటు పోవడానికి వీల్లేదు.. అధికారులకు కేసీఆర్ ఆదేశాలు

vimala p

ఇక్కడ డబ్బులు చెట్లకే కాస్తున్నాయ్…!!?

vimala p

ఒంగోలులో మైనర్ బాలిక పై అత్యాచారం.. ఆరుగురు నిందితుల అరెస్ట్

vimala p