telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీరెడ్డిపై మరో ఫిర్యాదు… పోలీసులను ఆశ్రయించిన రాకేష్ మాస్టర్

Rakesh-Master

మీడియా ఛానెల్స్‌కి వెళ్లి తనపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్న సినీ నటి కరాటే కళ్యాణి, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్‌పై శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆమెపై నటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేయడం తెలిసిందే. కొంతకాలం కిందట టాలీవుడ్ లో చోటుచేసుకున్న అవాంఛనీయ పరిణామాల నేపథ్యంలో శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చింది. ఇటీవల కొంతకాలంగా మళ్లీ తనదైన శైలిలో వ్యాఖ్యలు ప్రారంభించింది. తాజాగా టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కూడా శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతుండడంతో భరించలేకపోయిన రాకేశ్ మాస్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో వార్ జరిగిన విషయం తెలిసిందే.

Related posts