telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

క్లోరోక్విన్ పంపకుంటే ఇండియాపై చర్యలు: ట్రంప్ హెచ్చరిక

trump usa

హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ ను యూఎస్ కు ఎగుమతి చేయకుంటే, భారత్ పై బదులు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్ హౌస్ లో జరిగిన కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ బ్రీఫింగ్ లో మాట్లాడిన ఆయన, అమెరికా, ఇండియా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. అయితే, యూఎస్ ఆర్డర్ ఇచ్చినట్టుగా మెడిసిన్ ను ఎందుకు పంపించడం లేదన్న కారణం మాత్రం తెలియడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

“అది నరేంద్ర మోదీ నిర్ణయమని నేనేమీ అనుకోవడం లేదు. ఇతర దేశాలకు కూడా దాని ఎగుమతిని నిలిపివేసినట్టు మోదీతో ఫోన్ లో మాట్లాడిన వేళ నాకు తెలిసింది. ఆయనతో సంభాషణ నాకు సంతోషాన్ని ఇచ్చింది. అమెరికా కోరిక మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను విడుదల చేస్తారనే అనుకుంటున్నా” అని అన్నారు. ఇరు దేశాల మధ్యా వాణిజ్యపరంగా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఒకవేళ ఔషధాన్ని పంపకుంటే ఏం చేయాలన్న విషయాన్ని ఆలోచిస్తామని, పరిస్థితిని బట్టి యూఎస్ నిర్ణయాలుంటాయని అన్నారు.

Related posts