telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

తెలుగు అసురన్ లో .. చైతు…

Venki mama

విక్టరీ వెంకటేష్ ‘అసురన్’ రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్స్‌పై సురేష్ బాబు, కళైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. శ్రియ కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అసురన్ ఫ్లాష్ బ్యాక్‌లో ధనుష్ యంగ్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. వయసు రీత్యా ధనుష్ యంగ్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు.

తెలుగు రీమేక్‌లో వెంకీ యంగ్ రోల్‌లో కనిపించడం కష్టం కాబట్టి ఆ క్యారెక్టర్ వెంకీ మేనల్లుడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య చేస్తే బాగుంటుంది.. ‘ప్రేమమ్’లో టీనేజ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నాడు చైతు.. అసురన్ రీమేక్‌లో యంగ్ క్యారెక్టర్‌కి చైతు అయితే కరెక్ట్‌గా సరిపోతాడు అనే మాట సినీ వర్గాల్లో వినబడుతుంది.

Related posts