telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

చిత్తూరు జిల్లా : .. విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతులు..

chittoor district farmers protest for seeds

వర్షాలు పడటం ప్రారంభం కావటంతో రైతులు వ్యవసాయపనులు ప్రారంభించారు. కానీ అధికారులు విధానాలను సరిపడా అందుబాటులో తెచ్చేందుకు విఫలం అయ్యారు. దీనితో వ్యవసాయ విత్తనాలు అందక పలుచోట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో ఈ రోజు రైతులు రోడ్డుపై బైఠాయించారు. తమకు వేరుశనగ విత్తనాలను ఇంతవరకూ వ్యవసాయ అధికారులు సరఫరా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని 2 గంటల పాటు రోడ్డును దిగ్బంధించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడి విత్తనాలు సరఫరా చేయిస్తామనీ, ఆందోళనను విరమించాలని రైతులను కోరారు. దీనితో శాంతించిన రైతన్నలు తమ ఆందోళనను విరమించారు. ఏపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, విత్తనాలకు కేటాయించాల్సిన మొత్తాన్ని అప్పటి సీఎం చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ప్రలోభాల స్కీములకు వాడేశారని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.

Related posts