telugu navyamedia
సినిమా వార్తలు

“చిత్రలహరి” రివ్యూ

Chitralahari

బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్
నటీనటులు : సాయి తేజ్, నివేదా పేతురాజ్‌, కళ్యాణి ప్రియదర్శన్‌, సునీల్, వెన్నెల కిషోర్
దర్శకత్వం : కిషోర్ తిరుమల
సంగీత దర్శకుడు : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు : నవీన్, వైవీ రవిశంకర్, సివి మోహన్

మెగా మేనల్లుడు వరుసగా ఆరు డిజాస్టర్లను అందుకున్నాడు. తాజాగా మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవడానికి “చిత్రలహరి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి సాయి తేజ్ కమర్షియల్ హంగులను పక్కన పెట్టి సరికొత్త కథతో హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈసారి హిట్ కోసం సాయి ధరమ్ తేజ్ ఏకంగా తన పేరులోని ధరమ్ ను తీసేసి “సాయి తేజ్”గా మార్చుకున్నాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “చిత్రలహరి”తో సాయి తేజ్ కు అదృష్టం కలిసొచ్చిందా ? లేదా? అనేది చూద్దాము.

కథ :
కోర్టులో ఒక సీన్ తో సినిమా మొదలవుతుంది. జడ్జి తన తీర్పును చెప్పేముందు విజయ్ (సాయి తేజ్) తన గతంలోకి వెళ్ళిపోతాడు. టివి సర్వీస్ సెంటర్ లో వర్క్ చేసే విజయ్ ని బ్యాడ్ లక్ ఓ రేంజ్ లో వెంటాడుతుంది. అతనికి ఎన్నో మంచి ఐడియాలు ఉన్నప్పటికీ ఎవరూ పెద్దగా వాటిని పట్టించుకోకపోవడంతో సక్సెస్ అవ్వలేకపోతాడు. అలాంటి విజయ్ ను లహరి (కళ్యాణి ప్రియదర్శన్) ప్రేమిస్తుంది. అతను చేసే పతి పనిలోనూ అతని లవ్, బ్యాడ్ లక్ అతన్ని వెంటాడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే లహరి, విజయ్ మధ్య బ్రేకప్ అవుతుంది. అసలు విజయ్, లహరిలకు ఎందుకు బ్రేకప్ అవుతుంది ? ఈ సినిమాలో సునీల్, నివేదా పేతురేజ్ పాత్రలు ఏంటి ? చివరకు కథ ఎలాంటి మలుపు తిరిగింది ? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
సాయి తేజ్ లైఫ్ అండ్ లవ్ ఫెయిల్యూర్ పాత్రలో విజయ్ కు పూర్తిగా న్యాయం చేశాడు. ఈ పాత్రలో సాయి తేజ్ నటన మరింత మెరుగైనట్లు కన్పిస్తుంది. తన నటనతో ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా అలరిస్తాడు. పోసాని కృష్ణ మురళికి ఈ సినిమాలో విజయ్ తండ్రిగా మంచి పాత్ర లభించిందని. ఇక హీరోయిన్లు కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురేజ్ ఫరవాలేదన్పించారు. ఇక వెన్నెల కిషోర్ నవ్వించడానికి బాగా ప్రయత్నించాడు. సునీల్, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
యూత్ కు కనెక్ట్ అయ్యే సరికొత్త కథను ప్రేక్షకులను పరిచయం చేయడానికి ప్రయత్నించాడు దర్శకుడు. లైఫ్ లో అపజయాలను చూసే వ్యక్తి ఎలాంటి ఆలోచనలతో ముందుకు సాగాడు అనే పాయింట్ ను దర్శకుడు తెరపై తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించాడు. కానీ అక్కడక్కడా రొటీన్ సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి. అంతేకాదు రొటీన్ కామెడీ కూడా ఎక్కువగానే ఉంది. కానీ దర్శకుడు కిషోర్ తిరుమల మార్క్ ఎమోషన్ ను ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఇక పాటలు ఫరవాలేదన్పించాయి. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగట్లుగా ఉన్నాయి.

రేటింగ్ : 2.75/5

Related posts