telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

చిరు కి .. తగిన టైటిల్ కాదని.. కొరటాలను ట్రోల్ చేస్తున్న అభిమానులు..

anasuya with chiranjeevi in koritala movie

నటుడు చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా సినిమా తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమా ఇటీవల అక్టోబర్ రెండవ తారీకున గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ అయ్యి చిరంజీవి కెరియర్ లోనే అత్యంత భారీ కలెక్షన్లు మరియు రికార్డు సృష్టించిన సినిమాగా మరియు అదే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని బాహుబలి రికార్డులను పగలగొట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా దసరా సెలవులు సందర్భంలో వచ్చిన ఈ సినిమాకి పోటీగా మరొక సినిమా లేకపోవడంతో కలెక్షన్ల పరంగా చిరంజీవి కెరీర్ లోనే కొత్త రికార్డు సృష్టించి మెగా అభిమానులను కాలర్ ఎగరేసే విధంగా ‘సైరా’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

కొరటాలతో చేయబోయే సినిమా కోసం మంచి జోష్ మీద ఉన్న చిరంజీవి ఆ సినిమా కోసం బరువు తగ్గడం కోసం ప్రస్తుతం స్పెషల్ ట్రైనర్ ఆధ్వర్యంలో జిమ్ లో వర్కౌట్లు చేస్తు స్పెషల్ డైట్ పాటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంబందించిన టైటిల్ విషయంలో వస్తున్న వార్తలు మెగా అభిమానులను గగ్గోలు పెడుతున్నాయి. ఇటీవల ఈ సినిమా స్టొరీ కి షూట్ అయ్యేలా ‘గోవిందా హరి గోవిందా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో వచ్చిన నాగార్జున, శ్రీదేవి సినిమా గోవిందా గోవింద ఫ్లాప్ కావడంతో, చిరు ఎందుకు ఇలాంటి టైటిల్ ని ఎంచుకున్నారని అభిమానులందరూ గోల గోల చేస్తున్నారు టైటిల్ మార్చాలని కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి టైటిల్ ఏంటి అని మరి కొంతమంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి రెండు పాత్రలలో నటిస్తున్నాడు అని ఇండస్ట్రీలో చాలామంది అంటున్నారు.

Related posts