telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ కీర్తి అజరామరం… వారితో కలిసి నటించడం నా అదృష్టం : చిరంజీవి

NTR

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటిన మహా నటుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఆరాధ్య నటుడిగా ప్రజల గుండెల్లో చెరిగిపోని జ్ఞాపకంగా నిలిచిపోయారు. ఈ సందర్భంగా ఎన్టీయార్‌తో తనకున్న అనుబంధాన్ని మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకున్నారు. “తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం, నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజు నాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ…” అని ట్వీట్ చేసి ఎన్టీయార్‌తో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఎన్టీయార్, చిరంజీవి కలిసి `తిరుగు లేని మనిషి` సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Related posts