telugu navyamedia
సినిమా వార్తలు

చిరు స్పెషల్ డే.. స్పెషల్ ట్వీట్..

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న స్థానం అంచనాలకు అందదు.. సినీ పరిశ్రమలో చిరంజీవి ఓ అధ్యాయనం.. ఓ సంచలనం..ఎలాంటి బ్యాగౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ..కళామ్మతల్లి ఒడిలో 40 ఏళ్లకు పైగా నటుడిగా కొనసాగుతూ ఎన్నో మైళ్లు రాళ్లు అధిగమించారు.

Chiru all set to quit MEK

చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా  తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా.. మెగాస్టార్‏గా మారారు.  ప్రాణం ఖరీదు సినిమాతో చిత్రపరిశ్రమలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన చిరు..అ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన టాప్ హీరోగా ఎదిగారు.

Happy Birthday Chiranjeevi: 5 best performances of Megastar you shouldn't  miss | IndiaToday

తనను ఇంతటి స్టార్‏గా మారడానికి గల కారణమైన రోజును గుర్తుచేసుకుంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు చిరంజీవి. చిరుకు సెప్టంబర్‌ 22 చాలా ప్రత్యేకమంటున్నారు. నటుడిగా తాను ఇదే రోజున సినీ పరిశ్రమలో తెలుగు ప్రజలకు పరిచమయ్యానని గుర్తుచేసుకున్నారు.

Desperate Attempts to Revive Glory of MEK

ఆగస్ట్ 22 నేను పుట్టినరోజైతే 22Sept నటుడిగా నేను పుట్టినరోజు. కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికి నన్ను నటుడిగా పరిచయంచేసి మీ ఆశీస్సులు పొందినరోజు. నేను మరిచిపోలేనిరోజు…నేను మెగాస్టార్‌లా ఈ రోజు మీ ముందు ఇలా ఉండడానికి ఎంతో మంది సోదర సోదరీమణులే కారణమంటూ చిరు తన ట్వీట్ లో పేర్కొన్నారు.  

Chiranjeevi Biography, Images, Awards, Political career, Weight, Personal  Life, Family - HotGossips

మెగాస్టార్‏ను తెలుగు ప్రజలకు ఒక నటుడిగా పరిచయం చేసిన ప్రాణం ఖరీదు సినిమా 1978, సెప్టెంబర్ 22న  విడుద‌లై సరిగ్గా నేటితో  43 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను మెగాస్టార్ గుర్తుచేసుకుంటూ ఓ పోస్టును షేర్‌ చేశారు.

Related posts