telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టీవీ ఛానళ్లపై మెగాస్టార్‌ చిరు కామెంట్‌

చిరంజీవి ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్‌గా అందరికి చిరు సుపరిచితమే. ప్రస్తుతం ఈ హీరో ఆచార్య సినిమాలో చేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ సమావేశానికి హాజరయిన చిరు తనకు శానిటైజర్ వాడాలంటే భయంగా ఉందని అన్నారు. అంతేకాకుండా దానికి కారణం కూడా ఆయన తెలిపారు. ఈ సమావేశంలో చిరు 12 సంవత్సరాల క్రితం తన అనుభవాన్ని పంచుకున్నాడు. దాంతో పాటు మీడియా వారి వైఖరిని ఆయన తెలిపాడు. మాట్లాడేందుకు వచ్చిన చిరు రావడంతోనే మీడియా వారి ముందు శానిటైజర్ వాడాలంటే నాకు భయంగా ఉందని అన్నారు. ‘నా జేబులో శానిటైజర్ ఉంది. కానీ దాన్ని వాడాలంటేనే కాస్త భయంగా ఉంది. మైక్ డ్రోప్స్ ఉంటాయి. అందుకని శానిటైజ్ చేయాలనుకున్నా. కాని మీడియాను చూసి ఆగిపోయాను. దానికి కారణంగా 12 సంవత్సరాల క్రితం తాను ఎదుర్కొన్న సంఘటనను పంచుకున్నారు. అయితే అప్పట్లో నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ప్రజా ప్రజారానికి వెళ్లాను. అక్కడ అందరికి షేక్ హ్యండ్ ఇచ్చి. నేను బస్ ఎక్కాను నాతో పాటు మీడియా వారు కూడా ఉన్నారు. వారేదో మాపై ప్రేమతో ఉండరని, ఎక్కడ మేము తప్పు చేస్తామా అని ఎదురు చూస్తుంటారు. అప్పుడు బస్‌లో నేను చేతులు శానిటైజర్ చేసుకున్నాను. అది కూడా పక్కన ఉన్న వారు పండ్లు ఇస్తుంటే శానిటైజ్ చేసుకొని అవి తిన్నా. ఇదంతా మీడియా వారు రికార్డు చేశారు. కానీ అందులో మొత్తం కట్ చేసి ప్రజలకు షేక్ హ్యండ్ ఇవ్వడం, నేను శానిటైజ్ చేసుకొవడం రెండే రెండు సీన్‌లను వరుస పెట్టి చూపించారు. దానికి తోడుగా అభిమానులు అస్పృస్యులా, వీరా ప్రజా సేవ చేసేది అన్నార’ని చిరు చెప్పాడు. కావాలంటే మీ దగ్గర వీడియోలు ఉంటాయి, అవి చూపించండి అప్పుడు ప్రజలే మీకు సమాధానం చెబుతారని అన్నారు. అంతటితో ఆగకుండా అప్పుడు శానిటైజ్ చేస్తే తప్పన్నారు. ఇప్పుడు చేయకపోతే తప్పంటున్నారన్నట్లు అన్నారు. మీడియా పై సటైర్లు వేశాడు.

Related posts