telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య వ్యాఖ్యలతో చిరు షాకింగ్ డెసిషన్…?

chiru

గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో బాలయ్య చేసిన వ్యాఖ్యలపై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వంతో ఇండస్ట్రీ పెద్దలు జరిపిన చర్చలపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై నాగబాబు స్పందిస్తూ ఘాటుగా వ్యాఖ్యానించడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయ్యింది. ఓ వెబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇండస్ట్రీకి చెందిన కొందరిని టార్గెట్ చేస్తూ బాలకృష్ణ మరో ఇష్యూని కూడా లేవనెత్తారు. మరి బాలకృష్ణ యాక్షన్‌కి మెగాస్టార్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పటి వరకు చిరంజీవి నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు. ఇండస్ట్రీలో మాత్రం చిరు రియాక్షన్‌పై రెండు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ఫోన్ చేసి బాలయ్యతో మాట్లాడారని, అవసరం అనుకుంటే అందరూ కలిసి వెళ్లాలని, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరూ రావాల్సి ఉంటుందని చిరు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. చిరు సమాధానం విన్నాక బాలయ్య కూడా కూల్ అయ్యారని, ఖచ్చితంగా అందరూ ఈ విషయంలో కలిసి వెళదాం అని బాలయ్య అన్నారని అంటున్నారు. ఇంతటితో ఈ సమస్య ముగిసినట్లే అని ఒకవైపు వినిపిస్తుంటే.. మరో వైపు చిరంజీవి ఇకపై షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్‌కు సంబంధించి ప్రభుత్వం జరిపే చర్చలకు హాజరు కాకూడదనే నిర్ణయానికి వచ్చారనే వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీకి మంచి చేయాలని, కరోనాని కూడా లెక్కచేయకుండా పెద్దలని కలుస్తుంటే ఇటువంటి నిందలు తనపై వస్తున్నందుకు ఆయన హర్ట్ అయ్యారని అంటున్నారు. అందుకే తన సినిమా షూటింగ్ విషయంలో కూడా తొందరపడకుండా ఆగస్ట్ లేదంటే సెప్టెంబర్‌లో స్టార్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. మరి ఈ రెండింటిలో ఏది నిజమో తెలియాల్సి ఉంది.

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం దాదాపు రెండు నెలలుగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్, ప్రొడక్షన్, విడుదల తదితర పనులు ఆగిపోయాయి. దీంతో సినీ పరిశ్రమ భారీగా నష్టపోయిందనే చెప్పాలి. ఈ కష్టకాలంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘సిసిసి మనకోసం’ అనే సంస్థ ఏర్పాటైన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లోని పెద్దలైన సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, మెహర్ రమేష్ వంటి వారిని ఈ కార్యక్రమానికి పురమాయించి దాదాపు 14000 సినీ కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ‘సిసిసి మనకోసం’ సంస్థకు ఎందరో సెలబ్రిటీలు తమవంతుగా ఆర్థిక సహాయం అందించారు. ఎవరెవరు ఎంత డొనేట్ చేశారో ప్రతీది చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

Related posts