telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బాలయ్యకు .. మెగాస్టార్ ప్రమోషన్ .. అప్పట్లో అదో హిట్..

chiranjeevi pramotion to balakrishna

ఒకప్పుడు ఎవరికి వారే అన్నట్టు ఉన్న టాలీవుడ్ లో మెల్లిగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి హీరోలు ఒకరి సినిమాను ఒకరు ప్రమోషన్ చేసుకుంటూ.. ఒకరి ప్రమోషన్ వేడుకలకు మరొకరు హాజరవుతూ అందరిని కలుపుకు పోతున్నారు. ఓ సినిమా మాత్రం ఈ ఇద్దరు స్టార్స్ ను కలిపింది. ఇద్దరు కలిసి సినిమాకు పనిచేయలేదు కానీ, ప్రమోషన్ విషయంలో సహకరించుకున్నారు. ఆ సినిమా ఎదో కాదు ఆదిత్య 369 సినిమా. సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్దలనే కాదు చిన్న పిల్లలను కూడా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించిన తరువాత ఇంకా కొంచం ప్రమోషన్ చేయాలని దర్శక నిర్మాతలు భావించారు.

ఇప్పట్లో మాదిరిగా అప్పుడు ఛానల్స్ లేవు. దూరదర్శన్ ద్వారా మాత్రమే ప్రమోషన్ చేయాలి. లేదంటే పేపర్లో యాడ్ వేయాలి. సింగీతం శ్రీనివాసరావు, నిర్మాతలు అలోచించి నిర్ణయం తీసుకున్నారు. మెగాస్టార్ తో ఈ సినిమాకు సంబంధించిన ఓ యాడ్ ను తీయాలని అనుకున్నారు. అనుకున్నట్టుగా మెగాస్టార్ ను కలిసి ఒప్పించి యాడ్ తీశారు. సింగీతం శ్రీనివాసరావు కాబట్టి సినిమాకు ఒకే చేశారు. యాడ్ మంచి విజయం సాధించింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ హిట్ అయ్యింది. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది ఆదిత్య 369. ఇందులో టైమ్ మెషిన్ అనే ఓ సాధనాన్ని వినియోగించి సినిమాను తెరకెక్కించారు. ఇప్పటిలా అప్పట్లో గ్రాఫిక్స్ లేవు.. వాటి గురించి పెద్దగా తెలియవు కాబట్టి సినిమాను జనాలు బాగా చూశారు.

Related posts