telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ ఫోటో చూడగానే మహేష్ కు మెసేజ్… : చిరంజీవి

Mahesh

మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రామబ్రహ్మం సుంకర,, దిల్‌ సుంకర, మహేశ్‌ నిర్మాతలు. రష్మిక మందన్నా కథానాయిక. విజయశాంతి ఓ కీలక పాత్రలో, తమన్నా ప్రత్యేక గీతంలో కనిపిస్తారు. ఈ నెల 11న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక ఆదివారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో జరిగింది. చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఈ మధ్యనే పేపర్‌ తిరగేస్తుంటే మహేశ్‌ ఫొటో కనిపించింది. ఆర్మీ డ్రెస్‌లో ఆ లుక్‌ చూడగానే కట్టిపడేసింది. వెంటనే మహేశ్‌బాబుకు మెసేజ్‌ పెట్టా. అలా జరిగిందో లేదో ‘సినిమా పూర్తయింది. ప్రీ రిలీజ్‌కు మీరు అతిథిగా రావాల’ ని అడిగారు. నేను ఆశ్చర్యపోయా. ఈ మఽధ్యకాలంలో ఒక హీరో సినిమా తీయడానికి ఏడాదిపైనే అవుతోంది. ఈ సినిమాను చాలా తక్కువ సమయంలో తీశారు. ఇండస్ర్టీకి ఇదే కావాలి. సినిమా పూర్తయ్యే వరకూ మహేశ్‌ ఒక్క పైసా కూడా తీసుకోలేదని విన్నాను. ఆరోగ్యకర సంప్రదాయం ఇది.. నేనెప్పుడూ నా సినిమాలకు అడ్వాన్స్‌ తీసుకోను. అదే రామ్‌చరణ్‌ కూడా ఫాలో అవుతున్నాడు. నిర్మాతకు వెన్నుదన్నుగా నిలబడటం సంతోషంగా ఉంది. ఈ విషయాన్నే మా దర్శకుడు శివతో అంటే ఆయన కూడా ‘మీతో సినిమా 80-85 రోజులకు మించదు’ అని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయాన్ని పబ్లిక్‌గా చెబుతున్నా’’ అని అన్నారు.

మహేశ్‌ మాట్లాడుతూ ‘‘ఒక్కడు’ సినిమా చూసి చిరంజీవిగారు నాతో చెప్పిన మాటలు, ‘అర్జున్‌’ సెట్‌కు వచ్చి ‘నీలాంటి వాళ్లు ఇండస్ర్టీకి అవసరం.. ఇండస్ర్టీని ముందుకు తీసుకెళ్లాలి’ అని చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ‘పోకిరి’ సినిమా చూసి ఆయన ఫోన్‌ చేస్తే వెళ్లి కలిశా. రెండు గంటల సేపు సినిమాలో నా నటన గురించి మాట్లాడారు. ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ సినిమాలు రిలీజ్‌ అయిన తర్వాత ఫస్ట్‌ ఫోన్‌ కాల్‌ ఆయన్నుంచే వచ్చింది. ఈ నెల 11న కూడా ఆయన్నుంచే ఫోన్‌ రావాలని కోరుకుంటున్నా. ‘కొడుకు దిద్దిన కాపురం’ తర్వాత మళ్లీ విజయశాంతిగారితో పనిచేశాను. భారతి క్యారెక్టర్‌ను ఆమె తప్ప మరొకరు చేయలేరు. అనిల్‌లో ఉన్న పాజిటివ్‌ ఎనర్జీని నేను ఏ దర్శకుడిలో చూడలేదు. జూలై 4న సినిమాను స్టార్ట్‌ చేేస్త డిసెంబర్‌ 18న షూటింగ్‌ అయిపోయింది. నేనెప్పుడూ ఇంత ఫాస్ట్‌గా సినిమా చేయలేదు. దానికి దర్శకుడే కారణం. నేను మాస్‌ సినిమా చేసి చాలా రోజులైందని ఫ్యాన్స్‌ కంప్లైంట్‌ చేస్తుంటారు. కథ నచ్చితేనే నేను సినిమా చేస్తా. అనిల్‌ కథ నచ్చింది కాబట్టే ఈ సినిమా చేశా’’ అని అన్నారు. విజయశాంతి మాట్లాడుతూ ‘‘1979 నుండి 2020 మరచిపోలేని జర్నీ నాది. నన్ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసింది కృష్ణగారు. మహేశ్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. మహేశ్‌ కొడుకు గౌతమ్‌తోనూ నటించడానికి నేను సిద్ధమే. ఒక్క మాటలో చెప్పాలంటే మహేశ్‌ బంగారం. మా కాంబినేషన్లో సీన్స్‌ అద్భుతంగా ఉన్నాయి. బోర్డర్‌లో మన కోసం పోరాడుతున్న సైనికుల కోసం ఈ సినిమాను అంకితమిస్తున్నాం’’ అని అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ ఎంత రచ్చ రచ్చగా ఉందో.. సినిమా అంతే రచ్చగా ఉంటుంది. మా సినిమాతో విజయశాంతిగారు రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. అనిల్‌ సుంకర మాట్లాడుతూ ‘‘మహేశ్‌ని ఫ్యాన్స్‌ ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపిస్తానని ఆ రోజున దర్శకుడు చెప్పాడు. అంతకంటే ఎక్కువ చూపించాడు. ఈ సినిమాతో ఆయన నెక్ట్స్‌ లీగ్‌ డైరెక్టర్‌ అవుతారు. నేషనల్‌ అవార్డు విజయశాంతిగారికి ఎందుకు వచ్చిందా? అని ఈ సినిమా చూసిన తర్వాత మరోసారి అందరికీ అర్థమవుతుంది. కాలర్‌ ఎత్తుకుని తిరిగేలా సినిమా ఉండాలని ఫ్యాన్స్‌ అంటున్నారు. తెలుగువాళ్లు తలెత్తుకుని తిరిగేలా ఉంటుంది’’ అని అన్నారు. అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘చిరంజీవి, మహేశ్‌, విజయశాంతి.. ఈ ముగ్గురినీ ఒకే వేదికపై చూస్తుంటే ఆకాశంలోని నక్షత్రాలన్నీ నేల మీదకు వచ్చినట్లు అనిపిస్తుంది. భారతి పాత్ర చేసిన విజయశాంతిగారికి రుణపడి ఉంటా’’. జనవరి 11న బొమ్మ దద్దరిల్లిపోతుంది’’ అని అన్నారు.

Related posts