telugu navyamedia
సినిమా వార్తలు

మెగాస్టార్ మాయాజాలమే నరేష్ ను గెలిపించిందా ?

Naresh Elected Maa President
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్  ఎన్నికల్లో మెగా స్టార్ ద్వి పాత్రాభినయం చేశాడా ?అవునని అంటున్నారు . ఒకవైపు శివాజీరాజాకు హామీ ఇచ్చి మరోవైపు నరేష్ గెలుగుకు కృషి చేశాడట . నరేష్ కోసం కృష్ణ విజయ నిర్మల , మహేష్ బాబు ల ఇమేజ్  ఎంత ఉపయోగపడిందో .. మెగాస్టార్ చిరంజీవి , నాగార్జున , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ ,మెగా ఫామిలీ హీరోలు చేసిన కృషి కూడా ఫలించిందని తెలుస్తోంది . 
నిజానికి ఈ ఎన్నికల్లో నరేష్ అధ్యక్షుడుగా గెలుస్తాడని ఎవరు ఊహించలేదు నరేష్ ప్యానల్ లో  డాక్టర్ రాజశేఖర్ , శ్రీమతి జీవిత  తప్ప మిగతా అందరు సన్నకారు చిన్నకారు నటీనటులే. అదే శివాజీ రాజా ప్యానల్ లో  లో శ్రీకాంత్ , కృష్ణా రెడ్డి , నాగినీడు , బెనర్జీ, ఏడిద శ్రీరామ్ , పరుచూరి వెంకటేశ్వర రావు తదితరున్నారు . గోల్డ్ ఏజ్ హోమ్, మా బిల్డింగ్ లాంటి హామీలు  నెరవేరుస్తానని శివాజీ హామీ ఇచ్చాడు . 
chiranjeevi on maa schemes
మొదటి నుంచి శివాజీరాజా గెలుపై ధీమాగా వున్నారు . చిరంజీవి కూడా శివాజీ వైపే అన్న కలర్ కూడా వచ్చింది . ప్రచారం కూడా అలాగే చేసుకున్నారు . అయితే నరేష్ చాపకింద నీరులా తన ప్రచారాన్ని సాగించాడు . అతనికి తోడు డాక్టర్ రాజశేఖర్  శ్రీమతి జీవిత కూడా తమ పలుకుబడిని ఉపయోగించారు .స్వయంగా పెద్ద నటీనటులనువ్యక్తిగతంగా  కలిసి అభ్యర్ధించడం ..తో సీన్ మారిపోయింది . హీరోలందరూ నరేష్ ప్యానల్ వైపు మొగ్గు చూపారు . 
నరేష్ కు తన తల్లి శ్రీమతి విజయ నిర్మల, కృష్ణ గారి ఆశీస్సులు  మెండుగా వున్నాయి .ఈ ఇద్దరు నరేష్ విజయానికి మెగా స్టార్ ద్వారా కృషి చేసినట్టు తెలిసింది .మహేష్  ప్రోతాహం ఉండటం  కూడా వీరికి బాగా కలసి వచ్చింది చిరంజీవి తాను స్వయంగా సమర్ధిస్తున్నట్టు అనిపించకుండా , తమ్ముడు నాగ బాబును నరేష్ వైపు పంపించాడు . నాగ బాబు , నరేష్ పేనల్ ను సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా స్వయంగా ప్రెస్సుమీట్లో పాల్గొన్నాడు . 
చిరంజీవి , నాగార్జున, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ లాంటి పెద్ద హీరోలు నరేష్ ప్యానల్ ను సపోర్ట్ చేస్తున్నట్టు చాలా మందికి తెలిసిపోయింది . అందుకే వోటింగ్ నరేష్ కు అనుకూలంగా జరిగింది . శివాజీరాజా, శ్రీకాంత్  ఇది ఊహించలేదు . ఓటమితో ఈ ఇద్దరు కంగు తిన్నారు . చిరంజీవి తెర మీదనే కాదు తెర వెనుక కూడా మెగా  స్టార్  అని మరోమారు నిరూపించుకున్నాడు . 
-భగీరథ

Related posts