telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆచార్య నుంచి తప్పుకుని రవితేజకి ఒప్పుకున్న త్రిష

trisha

ఆచార్య నుంచి త్రిష తప్పుకోడానికి కారణం మణిరత్నం సినిమాలో డేట్స్ సర్దుబాటు కాలేక సినిమాను వదిలేసుకుందని చెప్పాడు చిరంజీవి. కానీ త్రిష చెప్పిన కారణం మాత్రం మరోలా ఉంది. కొన్ని క్రియేటివ్ డిఫెరెన్సుల కారణంగానే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు అప్పట్లో చెప్పింది త్రిష. అయితే అక్కడ ఎవరితో ఆమెకు పడలేదనేది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే ఇదే సమయంలో రవితేజ సినిమాను ఓకే చేసింది త్రిష. కృష్ణ సినిమా తర్వాత మరోసారి ఈయనతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు. తమిళనాట సూపర్ హిట్ అయిన ఓ సినిమాకు రీమేక్ ఇది. వీర సినిమా తర్వాత మరోసారి ఈయనకు ఛాన్సిచ్చాడు మాస్ రాజా. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా బాగుంటుందని రవితేజ భావిస్తున్నాడు. దానికి ఈమె కూడా ఓకే చెప్పడంతో అంతా సెట్ అయిపోయింది. చిరంజీవిని కాదని రవితేజకు ఓకే చెప్పడం పట్ల త్రిషపై అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Related posts