telugu navyamedia
telugu cinema news

సిరివెన్నెల సీతారామశాస్త్రికి చిరంజీవి అభినందనలు

Chiranjeevi-with-Sirivennela

2019వ సంవత్సరానికి పౌర పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని కేంద్రం పద్మశ్రీ ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సిరివెన్నెల ఇంటికి మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి ఆయనని కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన తరువాత… ఇద్దరూ కలసి చాలా సేపు ఆత్మీయంగా ముచ్చటించారు. మరోవైపు మా అధ్యక్షుడు శివాజీరాజా, త్రివిక్రమ్ శ్రీనివాస్, బుర్రా సాయిమాధవ్, ఆర్పీ పట్నాయక్ తదితరులు కూడా సిరివెన్నెలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక కేంద్రం నలుగురికి పద్మ విభూషణ్ ప్రకటించగా, 14 మందికి పద్మభూషణ్ అవార్డులు, 112 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో నలుగురికి ఈ ఏడాది పద్మశ్రీ అవార్డులు లభించాయి. వీరిలో ఇద్దరు ఆంధప్రదేశ్‌కు, ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు. ఏపీ నుంచి ప్రముఖ చెస్‌ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, వ్యవసాయ రంగం నుంచి ఎడ్లపల్లి వేంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి సిరివెన్నెలతోపాటు భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ ఆటగాడు సునీల్‌ ఛెత్రిలను పద్మ శ్రీ వరించింది.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. కళలు, సాహిత్యం, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, పరిశ్రమలు, ఆరోగ్యం–వైద్యం, వర్తకం, క్రీడలు, సామాజిక సేవ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆయా రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖలను కేంద్రం పద్మ అవార్డులతో సత్కరించనుంది.


Related posts

‘రాంగీ’ చిత్రం తో … త్రిష విజయాన్ని అందుకుంటుందా… !

vimala p

కేసీఆర్ పై   పవర్ ఫుల్ కామెంట్ తో డైరెక్టర్ హరీష్ శంకర్

ashok

బిగ్ బాస్ 3… హోస్ట్ గా విక్టరీ వెంకటేష్… అందుకేనట..

vimala p