telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రపంచానికి చీకటి రోజు… ఆయనే మళ్లీ పుట్టి ఆ లోటును పూరించాలి : చిరంజీవి

Chiranjeevi-with SPB

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలు మృతి సంగీత ప్రపంచానికి చీకటి రోజని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఎస్పీ బాలు తనకు ఎన్నో పాటలు పాడారని, తన సక్సెస్‌లో ఆయన గాత్రానిది కూడా ప్రధాన పాత్ర అని చిరంజీవి పేర్కొన్నారు. “సంగీత ప్రపంచానికి చీకటి రోజు. సంగీత జ్ఞాని ఎస్పీ బాలసుబ్రహ్మణం మృతితో ఓ శకం ముగిసింది. నాకు బాలుగారు ఎన్నో పాటలు పాడారు. నా విజయంలో ఆయన గాత్రానికి కూడా ప్రధాన పాత్ర ఇవ్వాలి. దిగ్గజ గాయకుడు ఘంటసాల తర్వాత ఎవరు ఉన్నారని సంగీత ప్రపంచం ఆలోచిస్తున్న సమయంలో ఓ ధ్రువ తార ఎస్పీ బాలు రూపంలో అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మందిని దశాబ్దాలు పాటు బాలు తన గాత్రంతో అలరించారు. బాలు లాంటి మరో వ్యక్తి లేరు. ఆయనే మళ్లీ పుట్టి ఆ లోటును పూరించాలి. ఆయణ్ని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి” అని చిరంజీవి పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో 16 భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడిన ఆయన గొంతు మూగబోయిందన్న వార్త విని సంగీత అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఏకంగా 16 భాషల్లో పాటలు పాడిన అరుదైన ఘనత ఆయన సొంతం.

Related posts