telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

చిరంజీవి బ్లడ్ బ్యాంకు కు .. అరుదైన గౌరవం..

chiranjeevi blood bank got national award

నటుడు చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు అరుదైన గౌరవం దక్కింది. 1998 అక్టోబర్‌లో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించారు. అప్పటి నుంచి ఈ బ్లడ్ బ్యాంక్ తెలుగు ప్రజలకు నిరాటంకంగా సేవ చేస్తూనే ఉంది. ఆపద సమయాలలో 24 గంటలు-365 రోజులు రక్తదానంతో ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతూ వస్తున్నారు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది కంటి చూపును పొందగా.. లక్షలాది మంది ఆపద సమయాల్లో ఉచితంగా రక్తాన్ని పొందారు.

ప్రజల్లో రక్తదానంపై ఉన్న అపోహల్ని కూడా పోగొట్టే ప్రయత్నం చేసింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. అందుకే ఈ బ్లడ్ బ్యాంకుకు ఇప్పుడు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. న్యూఢిల్లీలోని ‘నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ’, హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ‘ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ’ నిర్వాహకులు సంయుక్తంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకును ఈ అవార్డుకి ఎంపిక చేశారు. డిసెంబర్ 1వ తేదీ ‘వరల్డ్ ఎయిడ్స్ డే’ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బ్లడ్ బ్యాంకుకు ఈ అవార్డును బహూకరించనున్నారు.

Related posts