telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలకృష్ణ సాయానికి… మెగాస్టార్ ప్రశంసలు

కరోనా నియంత్రణకు సాయంగా నిలుస్తూ రూ. కోటీ పాతిక లక్షల భారీ సాయం ప్రకటించిన నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక అభినందలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు మెగాస్టార్. థాంక్యూ మై డియర్ బ్రదర్ బాలయ్య ప్రతి కష్టసమయంలోనూ ప్రజలను ఆదుకోవడం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే మీరెప్పుడూ తోడుంటారు. కరోనా క్రైసిస్‌తో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) కి రూ. 25 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి రూ. 50 లక్షలు ఆర్ధిక సాయాన్ని ప్రకటించారని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు చిరు. ఈ సందర్బంగా ‘కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి)కి అందించిన రూ. 25 లక్షల చెక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు చిరంజీవి.

Related posts