telugu navyamedia
సినిమా వార్తలు

152వ సినిమాలో చిరు ద్విపాత్రాభినయం… హీరోయిన్ గా నయన్

Syeraa

చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కోసం హైద‌రాబాద్ శివార్ల‌లో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది వేస‌వికి ఈ సినిమాను విడుదల చేయాలనీ భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమాలో న‌య‌న‌తార‌ను హీరోయిన్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “సైరా”. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్త‌యింది. త‌న పాత్ర‌కు చిరంజీవి డ‌బ్బింగ్ చెప్ప‌డం కూడా పూర్తయ్యింది. కేవ‌లం సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ ప‌నులు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ఈ సినిమా అక్టోబ‌ర్ 2న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని కూడా రామ్ చరణ్ నిర్మిస్తుండగా… నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

Related posts