telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“చిన్న విరామం” ట్రైలర్… పునర్నవి కీలకపాత్రలో…

Viramam

సంజయ్‌ వర్మ, గరిమా సింగ్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బిగ్‌బాస్‌ ఫేం పునర్నవీ భూపాలం కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ఆదిత్య మ్యూజిక్‌ యూట్యూబ్‌ చానల్‌లో రిలీజ్‌ అయిన ఈ ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్‌ వస్తోంది. ఓ బిజినెస్‌మేన్‌ అనుకొని పరిస్థితుల్లో కొందరు దుర్మార్గులు చెప్పినట్టుగా వినాల్సి రావటం, తరువాత అతను నవీన్‌ నేని, పునర్నవీ భూపాలంలతో కలిసి ప్రయాణం చేయటం లాంటి సీన్స్‌తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్‌ చేశారు. ట్రైలర్‌ చూస్తుంటే హీరో సంజయ్‌ లుక్స్‌తో ఆకట్టుకోగా పునర్నవీ, నవీన్‌లు కామెడీతో మెప్పిచటం ఖాయమనిపిస్తోంది. డిఫరెంట్‌ లొకేషన్స్‌లో లావిష్‌గా సినిమాను తెరకెక్కించారు. ఎక్కువ భాగం రాత్రి పూట చిత్రీకరణ చేసినా విజువల్స్‌ చాలా క్వాలిటీగా రిచ్‌గా ఉన్నాయి. మూన్‌ వాక్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు సందీప్‌ చేగురి దర్శకుడు. భరత్‌ మాచిరాజు సంగీతమందిస్తున్నారు. అయితే ఈ సినిమా బిగ్ బాస్-3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలంకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts