telugu navyamedia
telugu cinema news

పోర్న్ సైట్స్ లో చిన్మయి ఫోటోలు… సమస్య రాజకీయాల వరకు…

Chinmayi-Sripada

గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో తనకు వేధింపులు ఎక్కువయ్యాయని గాయని చిన్మయి శ్రీపాద వరుస ట్వీట్లతో తన ఆవేదనను వ్యక్తం చేశారు. మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ సాహిత్య రచయిత వైరాముత్తుపై ఆమె చేసిన ఆరోపణలకు చాలామంది నుంచి చిన్మయికి బాగానే సపోర్ట్ లభించింది. కానీ మరోవర్గం నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక తనపై వేధింపులు ఎక్కువయ్యాయంటూ సంచలన వార్తలు చేస్తూ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ నెటిజన్ చిన్మయిని అభినందిస్తూ చీర కట్టుకోమని ట్విట్టర్ ద్వారా సలహా ఇచ్చాడు. దీనిపై స్పందించిన చిన్మయి “గతంలో ఇలానే కొందరి సలహాల మేరకు చీర కట్టుకుంటే కొంతమంది సైడ్ నుండి నా ఎద భాగం, నడుము కనిపించేలా ఫోటోలు తీసి వారిని సాఫ్ట్ పోర్న్ సైట్లోకి అప్లోడ్ చేశారు. మరికొంతమంది వాటిని చూస్తూ masturbating చేసుకున్న విషయాలను నాకు మెసేజ్ లుగా పంపించారు” అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించింది.

ట్విట్టర్ లో కావాలనే తన పట్ల ద్వేషపూరిత, జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇప్పుడు సమస్య రాజకీయాల వరకూ వెళ్లడంతో తన స్నేహితులు, సన్నిహితులు జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తున్నారని, ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు సంబంధించిన అన్ని విషయాలను బయటపెడుతున్నాననే కారణంతో కావాలనే తనకు ఇండస్ట్రీలో పని దొరక్కుండా చేస్తున్నారని, తనకు నచ్చిన పని నుండి తనను దూరం చేయడం ఎంతగానో బాధిస్తుందని, అయినా ఫర్వాలేదని… ఎక్కడో ఒక దగ్గర పని దొరక్కుండా పోదని ఆవేదన వ్యక్తం చేసింది.

Related posts

నటుడు శ్రీనివాసరెడ్డికి పితృవియోగం

vimala p

సీనియర్ నటి చనిపోయిందంటూ వార్తలు… స్పందించిన నటి

vimala p

సూర్య కటౌట్ కూల్చివేత… కట్టలు తెంచుకున్న అభిమానుల ఆగ్రహం

vimala p