telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

భార్యాభర్తల మధ్య గొడవ కారెక్కింది…. ఇలా…!

Angey-wife

చైనాలో కారులో వెళ్తున్న దంపతుల మధ్య ఓ చిన్న విషయమై మొదలైన ఘర్షణ కాస్తా పెద్దదిగా మారడంతో పట్టపగలే భర్తకు భార్య చుక్కలు చూపించింది. నడిరోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ పడగానే భార్య కారులోంచి దిగిపోయింది. ఆ తరువాత కారు రూఫ్‌పైకి ఎక్కి గంతులేయడం మొదలెట్టింది. భర్త కిందకు దిగమని ఆమెను బతిమాలిన పట్టించుకోలేదు సరికదా ఇంకా ఎక్కువ చేసింది. ఓ వైపు ట్రాఫిక్ గ్రీన్ సిగ్నల్ పడడంతో భర్తకు ఏం చేయాలో తోచలేదు. కారు పొనిద్దామనుకుంటే పైన ఉన్న భార్య ప్రమాదంలో పడుతుంది. దాంతో చేసేదేమిలేక అలాగే కారును నడిరోడ్డుపై ఆపేశాడు. దీంతో వెనుక ఉన్న వాహనదారులు పరిస్థితిని గమనించి పక్క నుంచి వెళ్లిపోయారు. ఇక అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఈ న్యూసెన్స్‌ను గమనించి వెంటనే అక్కడికి వచ్చి కారుపై నుంచి మహిళను కిందకు దించారు. ఆ తరువాత భర్తను పక్కకు తీసుకెళ్లి విచారించారు. విచారణలో భర్తకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో జరిమానా విధించారు. అలాగే న్యూసెన్స్‌కు కారణమైన భార్యను మందలించి వదిలిపెట్టారు. ఈ ఘటన దక్షిణ చైనాలోని హూనాన్ ప్రొవిన్స్ గ్జియాంగ్జి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కాస్తా చైనీస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Related posts