telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

విమానాన్ని దొంగిలించిన 13 ఏళ్ళ అబ్బాయి… ఎలాగంటే…!?

Plane

తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ హుఝౌ నగరంలోని ఓ ఎయిర్‌పోర్టులో 13 ఏళ్ళ బాలుడు ఎవరికీ తెలియకుండా లోపలికి ప్రవేశించి చిన్న విమానం దొంగలించబోయాడు. ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపేందుకు యత్నించిన అతడు కంట్రోల్ చేయలేక గార్డ్‌డ్రిల్‌ను ఢీకొట్టాడు. ఆ తరువాత మరో విమానం కోసం ప్రయత్నించాడు. ఈ తతంగమంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్తా బయటకు రావడంతో చైనీస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జూన్ 15 రాత్రి జరిగింది. ఇక బాలుడి చర్య వల్ల సమారు 8 వేల యువాన్ల (రూ.80వేలు) నష్టం వాటిల్లినట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు పేర్కొన్నారు. వీడియోలోని దృశ్యాల ఆధారంగా బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జాలీ రైడ్ కోసమే విమానాన్ని దొంగలించిబోయినట్టు బాలుడు తెలిపాడు. దీంతో అతడికి జరిమానా విధించి వదిలిపెట్టారు. కాగా ఎలాంటి నైపుణ్యం లేకుండా బాలుడు విమానాన్ని కంట్రోల్ చేసిన విధానానికి ముగ్ధులైన విమానాశ్రయ అధికారులు అతడికి పైలట్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం.

Related posts