telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కుక్క పేరు తెచ్చిన తంటాలు… యజమానిని కటకటాల్లోకి నెట్టింది

man abused dog caught cc cam

చైనాకు చెందిన బాన్ అనే 30 ఏళ్ల వ్యక్తి తన పెంపుడు శునకాలకు అందరిలా కాకుండా వెరైటీగా పేర్లు పెట్టి ఏకంగా జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. బాన్ ఇటీవల ఎంతో ఇష్టపడి రెండు పమేరియన్ కుక్కలను కొనుక్కున్నాడు. దాంతో వాటికి అందరిలా కాకుండా కొంచెం వెరైటీ పేర్లు పెడదామని అనుకున్నాడు. అలా చాలా సేపు ఆలోచించిన తరువాత బాన్‌కు రెండు పేర్లు తట్టాయి. అందులో ఓ శునకానికి “చెన్‌గువాన్” అని, మరో శునకానికి “షీగువాన్” అని పేర్లు పెట్టాడు. కాగా, చైనీస్ భాషలో “షీగువాన్” అంటే ట్రాఫిక్ పోలీసులు అని అర్థమట. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మనోడు ఆ శునకాల ఫోటోలు తీసి పేర్లతో సహా అంతర్జాలంలో పెట్టాడు. అది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో పోలీసులు బాన్‌ను వెతికి పట్టుకొని మరీ అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే చైనీస్ చట్టాల ప్రకారం ప్రభుత్వ సంస్థలు, పోలీసు సంస్థల పేర్లను పోలిన పేర్లు పెంపుడు జంతువులకు పెట్టడం నేరం. ఆ విషయం తెలియని బాన్ తన పెంపుడు కుక్కకు అదే పేరు పెట్టడంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారించిన న్యాయస్థానం బాన్‌కు 10 రోజుల జైలు శిక్ష ఖరారు చేసింది. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Related posts