telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

20 నెలల పాపను బోనులో పెట్టి, చిత్రహింసలు

Evil-Dad

కంటి పాపలా చూసుకోవాల్సిన కన్నబిడ్డను కాలితో తన్నుతూ చిత్రహింసలకు గురి చేశాడు ఓ కసాయి తండ్రి. వివరాల్లోకి వెళ్తే… కన్నకూతురిని బోనులో పెట్టి చిత్రహింసలు పెడుతున్న క్జూ కియన్ అనే వ్యక్తిపై అతని మాజీ భార్య కేసు పెట్టింది. చైనాలోని గాంగ్‌డాంగ్ ప్రొవిన్స్‌కు చెందిన క్జూ కియన్, క్జూ టింగ్‌ సంవత్సరం క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కూతురు తండ్రి దగ్గరే పెరుగుతూ వస్తోంది. కియన్ తన భార్య మీద ఉన్న కోపం కూతురిపై చూపిస్తూ వస్తున్నాడు. గుండెళ్లో పెట్టుకుని చూసుకోవాల్సిన 20 నెలల పాపను బోనులో పెట్టి వేధిస్తున్నాడు. కాలుతో పాపను కొడుతూ.. ఆ ఫొటోలను మాజీ భార్యకు పంపుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. మాజీ భర్త నుంచి తన కూతురిని కాపాడి.. తనకు అప్పగించాలని మహిళ పోలీసులను ఆశ్రయించింది. అయితే తనకు పోలీసులపై నమ్మకం లేదని టింగ్ చెబుతోంది. గతంలోనూ ఇలాంటి ఘటనపై పోలీసులను ఆశ్రయించగా.. భర్తలు ఒత్తిడితో అలా చేస్తారని భార్య అన్న తరువాత సర్దుకుపోవాలని సూచించినట్టు టింగ్ వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Related posts