telugu navyamedia
సినిమా వార్తలు

ఆస్కార్ అవార్డు సినిమాకు సెన్సార్ కట్స్

China to remove lgbt scenes from Bohemian Rhapsody

ఇటీవల ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో “బొహేమియన్ రాప్సోడీ” సినిమా కూడా అవార్డులు గెలుచుకుంది. ఇంగ్లాండ్ కి చెందిన ఫ్రెడ్డీ మెర్క్యూరీ, క్వీన్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమాను చైనాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే అక్కడ ఈ సినిమాను యథాతథంగా విడుదల చేయడం లేదట. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని ఎల్‌జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్) లాంటి సన్నివేశాలు ఉన్నాయి. ఆ సన్నివేశాలను తొలగిస్తేనే తమ దేశంలో సినిమా విడుదలకు ఒప్పుకుంటామని చైనా సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో ఆయా సన్నివేశాలను తొలగించక తప్పలేదు చిత్రబృందానికి. అయితే అనుకున్నదానికంటే ఎక్కువ సన్నివేశాలకు కత్తెర పడిందని సమాచారం. కథ ప్రకారం మెర్క్యూరీ పాత్ర మరో మగ పాత్రను ముద్దు పెట్టుకోవడం, డ్రగ్స్ కి సంబంధించిన సన్నివేశాలు తొలగించిన తరువాతే చైనాలో విడుదల చేస్తున్నారు.

Related posts