telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సాంకేతిక

అమెరికాపై .. పైచేయి సాధించిన .. చైనా.. ఒప్పుకున్న అగ్రరాజ్యం…

china overcomes america in

ప్రపంచంలో నెంబర్ వన్ కావాలని ప్రస్తుతం అనేక రాజ్యాలు/దేశాలు పోటీపడుతున్న విషయం తెలిసిందే. అందుకే యుద్దాలు వస్తాయేమో అని ఎవరికి వారు అత్యంత అధునాతన యుద్ధ సామాగ్రిని ఎప్పటికప్పుడు ఏర్పాటుచేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా కూడా తనవంతు కృషి చేస్తున్నా కూడా ఆర్థికమాంద్యంతో అవి అసలుగానే మిగిలిపోతున్నాయి. ఇదే అదునుగా చైనా తన పంతం నెగ్గించుకునేట్టు, అమెరికాను ఒక అడుగు దాటేసింది. ఎందులో అంటే, ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధ వ్యవస్థగా రూపొందే మార్గంలో హైపర్ సానిక్ ఆయుధ సాంకేతికత, మిసైల్స్ తయారీలో చైనా తన ముందంజ వేసిందని పెంటగానే వ్యాఖ్యానించింది. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ పేరిట ఓ నివేదిక విడుదల కాగా, వివిధ రకాల సాంకేతికతల విషయంలో చైనా ముందుంది.

నావెల్ డిజైన్, మీడియమ్, ఇంటర్ మీడియేట్ రేంజ్ మిసైల్స్, హైపర్ సోనిక్ ఆయుధాల టెక్నాలజీలో ప్రత్యర్థులను దాటేసిందని పేర్కొంది. ధ్వని కన్నా వేగంగా వెళ్లే మిసైల్స్ తయారీలో అమెరికా కన్నా కూడా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ముందుకెళ్లిందని తెలిపింది. ‘చైనా మిలటరీ పవర్’ పేరిట ఈ నివేదిక విడుదల కాగా, దీనిపై చైనా ఇంకా స్పందించాల్సి వుంది. ఇక చైనా సాంకేతిక అభివృద్ధిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని పెంటగాన్ అధికారి ఒకరు వెల్లడించారు.

తాజాగా చైనా మరో ఘనతను కూడా సాధించింది. తాను చంద్రుడిపైకి పంపిన రోవర్ లో బంగాళాదుంప, పత్తి పంటలను పండించే ఏర్పాటు చేసింది. అందులో పత్తి విత్తనం మొలకెత్తడం జరిగింది. ఇది అంతరిక్ష పరిశోధనలో కీలక పరిణామం అని చైనా అంటుంది. అంతరిక్షంలోకి వెళ్లే ఆస్ట్రనాట్లకు ఆహారం అందించే దిశగా ఈ ప్రయోగం ప్రధానమైనదని, అటువంటిదానిలో విజయం సాధించడం చైనా కు దక్కిన మరో ఘనతగా చెప్పుకోవచ్చు.

Related posts