telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

వేగంగా తగ్గుతున్న.. చైనా వృద్ధి రేటు.. యాపిల్ హెచ్చరిక.. ట్రంప్ పుణ్యమే

trump new policies on h1b visa

ప్రపంచ ఆధిపత్య రేస్ లో ముందు ఉండేందుకు కృషి చేస్తున్న దేశాలలో చైనా ఒకటి. అటువంటి దేశం ఎక్కువగా ఎగుమతులపై ఆధారపడటంతో దానిపై సమయం చూసి అమెరికా అధ్యక్షుడు వేటు వేశాడు. దానితో వెనక్కి తగ్గక తప్పలేదు చైనాకి. ఆ దేశ వృద్ధిరేటు త్వరగా తగ్గడానికి ట్రంప్ తెరతీసిన వాణిజ్య యుద్ధం బలంగానే పనిచేసింది. ఫలితంగా చైనా గత ఏడాది వృద్ధిరేటు 6.6శాతానికి చేరింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత చైనా నమోదు చేసిన అతి కనిష్ట వృద్ధి రేటు ఇదే. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి చైనా 6.4శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. గత త్రైమాసికంలో నమోదు చేసిన 6.5శాతం వృద్ధి రేటు కంటే ఇది తక్కువ.

ఇక, చైనాలో వృద్ధి రేటు మందగమనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా వృద్ధి రేటులో తగ్గుదల కొన్నేళ్లుగా కనిపిస్తూనే ఉంది. కానీ ఇటీవల కాలంలో ఇది వేగవంతమైంది. ఈ నెల మొదట్లో టెక్‌ దిగ్గజం యాపిల్‌ కూడా హెచ్చరికలు జారీ చేసింది. చైనాలో ఆర్థిక మందగమనం అమ్మకాలపై ప్రభావం చూపించవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. మరోపక్క చైనా కూడా ఎగుమతులపై ఆధారపడని ఆర్థిక వ్యవస్థను నిర్మించుకొనేలా ప్రయత్నాలను ప్రారంభించింది. దీనిలో భాగంగా దేశీయ విక్రయాలు పెరిగేలా చర్యలు తీసుకొంటోంది. నిర్మాణ రంగ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, పన్ను మినహాయిపులను పెంచడం, ఆ దేశ రిజర్వుబ్యాంకు‌ నిల్వలను తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది.

Related posts