telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

శ్రీలంకకు .. చైనా భారీ నజరానా.. భారత్ పై గురి..

china gifted war ship to srilanka

చైనా భారతదేశంపై తెరవెనుక ఇంకా రాజకీయాలు చేస్తూనే ఉంది. భారత్ కు కొంచం వ్యతిరేకం గా ఉన్న ప్రతి దేశానికీ ఏ సాయం అయినా చేస్తుంది చైనా. విలువైన బహుమతులతో వారిని తమవైపు తిప్పుకోడానికి కూడా తనవంతు కృషి చేస్తుంది. ఒకపక్క శాంతి చర్చలు జరుపుతూనే మరోపక్క ఇటువంటి కుటిల రాజకీయాలు చైనా ద్వంద వైఖరిని తెలియజేస్తున్నాయని, విశ్లేషకులు అంటున్నారు. మొన్నటిదాకా పాక్, నేడు చైనా కూడా అదేవిధంగా మూర్ఖంగా ప్రవర్తిస్తుండటం ఒకింత ఆశ్చర్యంగా ఉందని వారు అంటున్నారు. ఎన్ని చేసినా భారత్ ను తాకటం కూడా ఎవరి తరం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.

ఇప్పుడు ఈ చర్చ జరగటానికి కారణం, తాజాగా, శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునే క్రమంలో చైనా కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో ఓ పోర్టును నిర్మిస్తున్న చైనా.. తాజాగా ఓ యుద్ధనౌకను ఆ దేశానికి బహుమతిగా అందించింది. అలాగే, త్వరలోనే 9 కొత్త రకం రైళ్లను కూడా అందించనున్నట్టు చైనా ప్రకటించింది. ‘పీ 625’గా పిలిచే ఈ నౌక గత వారమే కొలంబో చేరుకుంది. శ్రీలంక దీనిని తీరప్రాంత గస్తీకి, సముద్ర దొంగలపై పోరాటానికి వినియోగించే అవకాశం ఉందని సమాచారం. యుద్ధ నౌకను తమకు బహుమానంగా ఇచ్చిన చైనాకు శ్రీలంక కృతజ్ఞతలు తెలిపింది.

Related posts