telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కరోనా కు .. వ్యాక్సిన్ కనుక్కున్నామంటున్న .. చైనా..

china found vaccine for corona virus

కరోనా వైరస్ ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది. ఈ వైరస్ ను కంట్రోల్ చేసే వ్యాక్సిన్ ఇప్పటివరకు లేకపోవడం,మరోవైపు చైనాలో 6 వేల మంది ఈవైరస్ బారిన పడటం, 132 మంది ప్రాణాలు కోల్పోడంతో అందరూ టెన్షన్ పడుతున్నారు. అయితే హాంకాంగ్ రీసెర్చర్లు ఇప్పుడు ఈ భయంకరమైన వైరస్ కు వ్యాక్సిన్ ను డెవలప్ చేశారు. అంటువ్యాధుల ఎక్స్ పర్ట్,హాంకాంగ్ యూనివర్శిటీ(HKU) ఫ్రొఫెసర్ యుయన్ క్వాక్-యంగ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…వ్యాక్సిన్ పై తన టీమ్ పనిచేస్తుందని తెలిపారు. కరోనా సోకిన పేషెంట్ల కోసం ఎప్పటిలోగా ఈ వ్యాక్సిన్ రెడీ అవుతుందనే ఖచ్చితమైన టైం చెప్పకుండా..ఇప్పటికే వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేశామని,కానీ జంతువులపై దీనిపై పరీక్షించడానికి చాలా సమయం పడుతుందన్నారు.

HKU పరిశోధకులు గతంలో క్వాక్-యుంగ్ బృందం కనుగొన్న ఇన్ఫ్లుయంజా వైరస్ వ్యాక్సిన్ ఆధారంగా ఈ వ్యాక్సిన్ కనుగొన్నారు. అదే వ్యాక్సిన్ ను వాళ్లు మాడిఫై చేశారు. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ ను అరికట్టగలదని చెబుతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ మనుషులు ఉపయోగించడానికి పనికొస్తుందని తేలాల్సి ఉంది. క్లినికల్ ట్రయల్ప్ తర్వాత మాత్రమే ఇది మనుషులకు ఉపయోగపడుతుందో లేదో తెలుస్తోంది. జంతువులపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించడానికి కొన్ని నెలల సమయం పడుతుందని,మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేయడానికి కనీసం ఓ ఏడాది పడుతుందని క్వాక్-యంగ్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను జంతువులకు ఎక్కించిన తర్వాత ఆ జంతువు పరిస్థితి తెలుస్తుందని, అనేక జంతు జీవుల్లో కనుక వ్యాక్సిన్ సురక్షితంగా,ప్రభావితంగా ఉన్నట్లు కన్పిస్తే మనుషులపై ఆ వ్యాక్సిన్ తో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమవుతాయన్నారు. యాంటీ కరోనా వైరస్ వ్యాక్సిన్ నెలరోజుల్లో రెడీ అవుతుందని చైనాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు లీఅ లంజువాన్ వ్యాఖ్యానించినట్లు వస్తున్న వార్తలపై క్వాక్-యాంగ్ సందేహాలు వ్యక్తం చేశారు.

Related posts