telugu navyamedia
study news

చదువు  కోసం పణంగా మానం.

vintha anubhuti poetry corner
అమ్మాయిలు నగ్నంగా దిగిన సెల్ఫీలను హామీగా తీసుకుంటున్న ఓ సంస్థ, వారికి విద్యారుణాలను ఇస్తున్న స్కామ్ చైనాలో ఇప్పుడు వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. చైనీస్ ఈ-కామర్స్ పేరిట ఏర్పడిన ఓ స్టార్టప్ సంస్థ ఈ దందా సాగించింది. చదువుకునేందుకు తగినంత డబ్బులేని వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారి నుంచి న్యూడ్ ఫోటోలు స్వీకరించి, రుణాలను ఇచ్చింది.
భవిష్యత్తులో వారు తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించడంలో విఫలమైతే, వాటిని బయట పెడతామని బెదిరించాలన్నది ఈ సంస్థ ఉద్దేశం. ఇక రోజువారీ ఖర్చులు, కాలేజీ ఫీజుల కోసం ఎంతోమంది అమ్మాయిలు వీరి వలలో చిక్కుకుని, తమ దృశ్యాలను తామే వారికి అందించి, అధిక వడ్డీకి అప్పులు తీసుకున్నారని తెలుస్తోంది. చైనా ఆర్థిక నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యవహారం సాగుతూ ఉండటం, విషయం బయటకు పొక్కి, నిరసనలు వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. సంస్థ లావాదేవీలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.



Related posts

20 శాతం ఇంజినీరింగ్ ఫీజులు బాదడానికి సిద్ధం అయిన ప్రభుత్వం…

ashok

బాలురతో మాట్లాడొద్దు..వీర్ సురేంద్రసాయి యూనివర్శిటీ వివాదాస్పద నోటీసు

ashok