telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కడుపునొప్పితో ఆసుపత్రికి… కడుపులో ఉన్నదాన్ని చూసి వైద్యులు షాక్

China doctors remove 14-cm long toothbrush from man's belly

చైనా లోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్ ఆస్పత్రికి లి అనే 51 ఏళ్ల వ్యక్తి విపరీతమైన కడుపు నొప్పితో వచ్చాడు. లిని సీటీ స్కాన్ చేసిన వైద్యులు అతడి పొట్టలో ఉన్న వస్తువును చూసి నిర్ఘాంతపోయారు. దాంతో అతడ్ని ప్రశ్నించగా తాను 20 ఏళ్ల క్రితం ఒకసారి ఆత్మహత్యకు యత్నించానని, ఆ సమయంలో టూత్ బ్రేష్ మింగేసినట్లు తెలిపాడు. దాని వల్ల 2014 వరకు లికి ఎలాంటి సమస్య రాలేదు. మెల్లగా కడుపు నొప్పితో ముత్రాశయంలో కూడా మంటగా ఉండేది. ఆ నొప్పి కాస్తా ఈ ఏడాదిలో జూన్ చివరి నాటికి తీవ్రంగా వేధించడం మొదలెట్టింది. దాంతో లి.. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్ ఆస్పత్రికి వచ్చాడు. అతడ్ని సీటీ స్కాన్ చేసిన తరువాత వచ్చిన రిపోర్టును చూసి వైద్యులు షాక్ అయ్యారు. లి పొట్టలో పొడువైన ఏదో వింత వస్తువు కనిపించింది. దాంతో వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ఒకవేళ సర్జరీ చేయడం ఆలస్యమైతే టూత్ బ్రష్ లివర్‌కు తాకి ప్రాణాంతకంగా మారేదని లికి ఆపరేషన్ చేసిన వైద్యుడు లియూ జియాలిన్ తెలిపారు. ఇక బయటకు తీసిన బ్రష్ పళ్లు అన్నీ ఉడిపోయి కేవలం గట్టిగా ఉన్న ప్లాస్టిక్ పదార్థం మాత్రమే మిగిలి ఉందని లియూ వెల్లడించారు. సూసైడ్‌కు యత్నించి కోలుకున్న తరువాత లికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాలు అవుతుండడంతో ఆ బ్రష్ సంగతే మరిచిపోయానని లీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Related posts