telugu navyamedia
రాజకీయ వార్తలు

చైనా కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అమెరికా!

america

అగ్ర రాజ్యం అమెరికా చైనాకు షాకిచ్చింది. చైనా తరపున గూఢచర్యానికి పాల్పడుతున్నాయని 33 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీల్లో ఏడు టెక్నాలజీ కంపెనీలు కాగా, మిగతా వాటిలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఉన్నాయి.చైనా మిలటరీతో ఈ సంస్థలకు సంబంధాలు ఉన్నాయని అమెరికా ఆరోపించింది.

మైనార్టీల ప్రయోజనాలను ఇవి కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయని అమెరికా తెలిపింది. చైనాలోని షింజియాంగ్‌లోని ఓ తెగ అయిన ఉగర్లపై సామూహిక నిర్బంధం, శ్రమ దోపిడీతోపాటు వారిపై నిఘా వేసిన చైనా అణచివేత కార్యక్రమంలో ఈ సంస్థలు భాగం పంచుకున్నాయని అమెరికా వాణిజ్య విభాగం ఆరోపించింది. మానవ హక్కుల ఉల్లంఘన, అధికార దుర్వినియోగానికి ఈ సంస్థలు పాల్పడుతున్నాయని పేర్కొంది.

Related posts