telugu navyamedia
health news trending

ఈ కాలంలో… పిల్లల ఆరోగ్యం.. మీచేతిలోనే…

children health tips in cold season

చలికాలంలో పెద్దలే అల్లాడిపోతుంటారు.. ఇక పిల్లల విషయం చెప్పాల్సిన పనేలేదు. అయితే మరి వారికి ఈ కాలంలో వచ్చే సాధారణ జలుబు, దగ్గు, శ్వాసకోశవ్యాధుల నుండి రక్షించుకోడానికి తీసుకోవలసిన కొన్ని జాగర్తలు చూద్దాం. తద్వారా వారికి ఆరోగ్యం చేకూరి, కుటుంబానికి ప్రశాంతత లభిస్తుంది. ఏమంటే పిల్లలు సంతోషంగా ఉంటేనే కదా, ఏ కుటుంబం అయినా సంతోషంగా ఉండేది. దానికోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు..

చలికాలంలో ఉదయాన్నే చలిగా ఉందని నిద్ర లేవడానికి పెద్దలే బద్దకిస్తారు, ఇక పిల్లలు ఏమి లేస్తారు. అందుకే వారిని రాత్రి త్వరగా నిద్రపోయేలా చూసుకోవాలి. అలాగే రాత్రి భోజనంలో కూడా సులభంగా జీర్ణం అయ్యే ఆహారం, త్వరగా నిద్ర పట్టేందుకు, గ్లాసు పాలు ఇవ్వాలి. దీనితో త్వరగా నిద్రపోవటమే కాదు, ప్రశాంతంగా నిద్రపట్టి, పొద్దున్నే ఉత్సాహంగా మేల్కొంటారు.

చలికాలంలో కూడా పాఠశాలకు వెళ్లారు కాబట్టి, వారికి ఉన్ని దుస్తులు వేసి బయటకు పంపించాలి. ఇంటికి వచ్చాక సాయంత్రం ఆడుకోడానికి వెళ్లేప్పుడు కూడా ఉన్ని దుస్తులు ధరించడం మంచిది. ఏమంటే చలి ఉదయం, సాయంత్రం బాగా ఉంటుంది. ఈ ఉన్ని శరీరానికి చలి తాగాలనివ్వదు కాబట్టి జలుబు తరహా వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఈ దుస్తులు తలను కప్పేవిగా ఉంటె మంచిది. కాళ్లకు కూడా సాక్సులు, షూ, చేతులకు గ్లోవ్స్ ధరిస్తే ఇంకా మంచిది.

ఈ కాలంలో చల్లటి వస్తువులకు దూరంగా ఉంచితేనే చాలా మంచిది.. అంటే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్.. లాంటివి. వీలైతే ఫ్రిజ్ లో నీటిని కూడా మీరు తాగటం మానేసి, పిల్లలకు కూడా ఇవ్వడం ఆపేయండి.

పిల్లల ఆహారం విషయంలో చలికాలం చాలా జాగర్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీలైనంతవరకు వేడిగా ఉన్న పదార్దాలు మాత్రమే ఇస్తుండాలి. మధ్యాహ్నం లంచ్ కూడా అలాగే ఉండేట్టు, హాట్ బాక్సులు వాడితే మేలు. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారం ఇవ్వడం అవసరం.

సాధారణంగా వచ్చే వ్యాధుల బారిన పడకుండా తదనుగుణంగా ఆయా పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ లు ఎక్కువగా లభ్యమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. తాజాగా ఉన్న ఆకుకూరలు, సూప్స్, క్యారెట్లు, టమోటా, నట్స్ వంటివి ఇస్తుండాలి. ఈ కాలంలో లభ్యమయ్యే పండ్లు, కూరగాయలు తప్పకుండ ఇవ్వాలి.

పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి త్వరగా పగుళ్ళకు గురిఅవుతుంది. దానిని నివారించేందుకు మాయిశ్చరైజింగ్ క్రీమ్ లను రాస్తుండాలి. చలికాలం అయినా కూడా పిల్లలకు రెండుపూటలా స్నానం చేయించాలి. దానివలన పిల్లల చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, దూళి పోతాయి, తద్వారా వచ్చే చర్మ పగుళ్లు తగ్గిపోతాయి.

Related posts

మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం.. హైదరాబాద్ కు తరలింపు

vimala p

కేటీఆర్ కు దమ్ముందా.. కొడంగల్‌ ఎన్నికపై రేవంత్‌ సవాల్‌!

vimala p

నేడు మెజార్టీలో సిద్ధిపేట ఢిల్లీని తాకింది: హరీష్

vimala p