telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక సినిమా వార్తలు

హైదరాబాద్ : …. జర్మన్ బాలల చిత్రోత్సవానికి … సినీ ఔత్సాహికుల విశేష స్పందన …

children film festival in hyderabad

బాలల దినోత్సవ సందర్భంగా రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రీవ్యూ థియేటర్‌లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, జర్మన్ సాంస్కృతిక విభాగమైన గోతే జెంత్రమ్ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ చిత్రోత్సవంలో రెండవరోజు మంగళవారం రాత్రి కాన్నీ అండ్ కో సినిమా ప్రదర్శించారు. కాన్నీ ఆమె ప్రాణస్నేహితురాలు పాల్ చేసిన సాహసాలతో పాటు వారు చేసుకున్న కొత్త స్నేహాల ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

జర్మన్ బాలల చిత్రోత్సవానికి సినీ ఔత్సాహికుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ చిత్రానికి ఫ్రాన్జిస్కాబుచ్ దర్శకత్వం వహించాడు. కాగా నేటి సాయంత్రం రవీంద్ర భారతిలోని పైడి జయరాజ్ ప్రీవ్యూ థియేటర్‌లో సాయంత్రం 6-30 నుంచి చిల్డ్రన్ ఆన్ ది మూన్ చిత్రం ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు ఆహ్వానం పలికారు. ప్రవేశం ఉచితం.

Related posts