telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : చరణ్, ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రల్లో ఈ బాలనటులు…!

RRR

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, వోవియా, అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్ ఆగింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ల చిన్నప్పటి సన్నివేశాలు ఉంటాయట. అందులో చక్రి, వరుణ్‌ బుద్ధదేవ్‌, స్పందన చతుర్వేది ఈ సినిమాలో బాలనటులుగా నటిస్తున్నారట. స్పందన చతుర్వేది తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్‌ చేస్తూ ”ఆర్‌.ఆర్‌.ఆర్‌’ షూటింగ్‌లో అందమైన మధురజ్ఞాపకాలు. దీన్ని ఆశీర్వాదంగా ఫీల్‌ అవుతున్నా” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరోబాలనటుడు చక్రి ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ.. తానూ కొమరం భీమ్‌ చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్నట్లుగా వెల్లడించాడు. దీనితో వరుణ్‌ బుద్ధదేవ్‌ అల్లూరి సీతారామరాజుగా చరణ్ చిన్నప్పటి పాత్రను పోషిస్తున్నట్టుగా నెటిజన్లు భావిస్తున్నారు. ఇక సీతగా చిన్నప్పటి అలియా భట్ పాత్రలో స్పందన చతుర్వేది నటిస్తోంది.

 

View this post on Instagram

 

With Ramcharan Sir….in Hyderabad…… RRR …….

A post shared by Spandan Chaturvedi Official (@spandan_chaturvedi_the_real_me) on

 

View this post on Instagram

 

Beautiful memories while shooting for RRR. 🙌 Blessed

A post shared by Spandan Chaturvedi Official (@spandan_chaturvedi_the_real_me) on

Related posts