telugu navyamedia
news political

కాసేపట్లో ‘అయోధ్య’ తీర్పు.. సుప్రీం కోర్టుకు చీఫ్ జస్టిస్

Supreme Court

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదుపై కాసేపట్లో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో 40 రోజుల పాటు రోజువారీ విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గత నెల 16న తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చాలా సున్నితమైన ఈ కేసులో తీర్పు శనివారం ఉదయం 10:30 గంటలకు తుది తీర్పు వెలువరించేందుకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ సుప్రీం కోర్టుకు చేరుకున్నారు.

చీఫ్ జస్టిస్‌తో పాటు నలుగురు జడ్జీలు కోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో అయోధ్య కేసుపై తుదితీర్పు వెల్లడించనున్నారు. కోర్టు హాల్‌కు పిటిషనర్లకు మాత్రమే అనుమతి ఉంది. కోర్టు ప్రాంగణంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అన్ని పక్షాల తరపు న్యాయవాదులు, మీడియా ప్రతినిధులతో కోర్టు ప్రాంగణం నిండిపోయింది.

Related posts

కవిత ఓటమికి కారణాలు వివరించిన కేటీఆర్‌

vimala p

జగన్ కు మోదీ జన్మదిన శుభాకాంక్షలు

vimala p

తిరుమలకు .. మరో రోడ్డు మార్గం.. ప్రయాణం ఇంకా సులభం..

vimala p