telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

పటిష్ట భద్రత మధ్య కోర్టుకు చేరిన చిదంబరం

congress chidambaram

ఐఎస్ఎక్స్ స్కామ్‌లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరంను బుధవారం రాత్రి సీబీఐ, ఈడీ అధికారులు, ఢిల్లీ పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు పటిష్ట భద్రత మధ్య పోలీసులు చిదంబరాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. చిదంబరాన్ని 14 రోజులు కస్టడీ కోరే అవకాశం ఉందని సమాచారం. ఆయనకు బెయిల్ కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, అభిషేక్ సింఘ్వీ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇంద్రాణీ ముఖర్జీ స్టేట్ మెంట్లతో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయితే తనకు స్కామ్‌లో ప్రమేయం లేదని.. తన కుమారుడు కార్తీతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని చిదంబరం చెబుతున్నారు. సీబీఐ కోర్టుకు కార్తీతో పాటు నళిని చిదంబరం కూడా చేరుకున్నారు.

Related posts