telugu navyamedia
రాజకీయ వార్తలు

సుప్రీంకోర్టులో చిదంబరానికి మ‌ధ్యంత‌ర బెయిల్‌!

congress chidambaram

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రానికి ఈరోజు సుప్రీంకోర్టు మ‌ధ్యంతర బెయిల్ మంజూరీ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబ‌రాన్ని అరెస్టు చేయ‌కుండా ఉండేందుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు సుప్రీంకోర్టులో చిదంబ‌రం బెయిల్‌కు సంబంధించి వాద‌న‌లు జ‌రిగాయి. సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టులో త‌న వాద‌న వినిపించారు.

చిదంబ‌రానికి వ్య‌తిరేకంగా సాక్ష్యాల‌న్నీ డిజిటిల్ డాక్యుమెంట్లు, ఈమెయిళ్ల రూపంలో ఉన్న‌ట్లు సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తెలిపారు. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 26తో ఆయన కస్టడీ పూర్తికానున్నందున, అదేరోజున ఆయన పిటిషన్ పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. అప్ప‌టి వ‌ర‌కు చిదంబ‌రం సీబీఐ క‌స్ట‌డీలోనే ఉంటారని కోర్టు చెప్పింది.

Related posts