telugu navyamedia
రాజకీయ వార్తలు

లాక్ డౌన్ ప్రకటించినా కరోనా కట్టడి కాలేదు: చిదంబరం

congress chidambaram

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం స్పందించారు. ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 40 లక్షలకు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన నేపథ్యంలో చిదంబరం మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రకటించినా కరోనా కేసులు కట్టడి కాలేదని అన్నారు. లాక్ డౌన్ నుంచి ప్రయోజనం పొందలేని ఏకైక దేశం ఇండియానే అని విమర్శించారు.

సెప్టెంబర్ 30 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 55 లక్షలకు చేరుతుందని తాను అంచనా వేశానని చెప్పారు. అయితే తన అంచనా తప్పు అని చిదంబరం చెప్పారు. సెప్టెంబర్ చివరికి కేసుల సంఖ్య 65 లక్షలకు చేరుకుంటుందని తెలిపారు. 21 రోజుల్లో కరోనాను ఓడిస్తామని ప్రధాని మోదీ చెప్పారని అన్నారు. ఇప్పుడు భారత్ ఎందుకు విఫలమైందో ప్రజలకు మోదీ సమాధానం చెప్పాలని చిదంబరం డిమాండ్ చేశారు.

Related posts