telugu navyamedia
crime news political Telangana

చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్

Chevella MP Vishweshwar Reddy Arrest

చేవెళ్ళ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జరిగిన అన్యాయంపై వికారాబాద్ లో ఆయన దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో ఆయన దీక్షను భగ్నం చేసి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. గత ఐదేళ్లలో జిల్లాకు ఒక కొత్త ఉద్యోగం కూడా రాలేదని మండిపడ్డారు. ఒక్క ఎకరానికి కూడా సాగు నీటిని ఇవ్వలేకపోయారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

Related posts

విశ్వ‌క్‌సేన్ హీరోగా “ఫ‌ల‌క్‌నుమా దాస్”… మెష‌న్ పోస్ట‌ర్…

vimala p

విపక్షాలకు షాక్.. వివిపాట్ ల లెక్కింపుకు .. ధర్మాసనం విముఖత..

vimala p

గౌతమ్ గంభీర్‌ .. బీజేపీలో .. అరుణ్ జైట్లీ సమక్షంలో ..

vimala p