telugu navyamedia
సినిమా వార్తలు

చెలి రాకతో..

aliveni poetry corner
నవ రాగమాలికా!
అమూల్య కానుకా!
నా జీవిత ఏలికా!
బ్రతుకున ప్రధాన భూమికా!
శిశిరంలా మోడు బారిన
నా జీవిత తోటలోకి నీ రాకతో
నిత్య వసంతం వచ్చింది
నీ కనుల మేఘాల్లోంచి
కురిసిన చూపుల ప్రేమవర్షంలో
మనసు మాగాణి తడిచి ముద్దై 
పరువాల పచ్చదనంపరచుకుంది
తనువు తరువు నిగనిగలాడే 
 తాజా ప్రేమ ఆకులతో
క్రొత్తదనం సంతరించుకుంది
నీ అధరాల కడలిలో చిలికిన ప్రేమామృతం
నా జిహ్వకు మధురానుభూతినిచ్చింది
నీ పరువాలు తొలిప్రొద్దులో
నా జీవితం దేదీప్యమానమే!
స్వర్గతుల్యమే!!
–గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts