క్రైమ్ వార్తలు

మోసమే అతని జీవితం… వంచనే అతని జీవనం…

ఇందుగలడందు లేడను సందేహం వలదు…
ఎందెందు వెదక చూసినా
అందందే కలడు
మాయలోడు మహిళో సుమతి !

మనుషుల్ని బురిడీ కొట్టించడం… మాయచేయడం అన్నది కొంతమంది వృత్తిగా పెట్టుకున్నారు. కష్టపడకుండానే లగ్జరీ జీవితాన్ని గడపడానికి మోసాన్ని నమ్ముకుంటారు. అదే జీవితంగా గడుపుతుంటారు. అయితే మోసం అనేది ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు. ఆ మోసాన్నే నమ్ముకున్న మోసగాళ్లు కటకటాలపాలు కాక తప్పదు.

ఇలాంటి ఓ మోసగాడే ఇప్పుడు పోలీసులకు దొరికిపోయాడు. తిరుపతి విమానాశ్రయానికి సూటుబూటు వేసుకొని వచ్చి ఘరానా అధికారిగా తనను తాను పరిచయం చేసుకున్న ప్రవీణ్ అనే అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలిసులు తీగ లాగారు. మోసగాడి డొంక కదిలిపోయింది. నకిలీ ఐడి కార్డుతో ఉన్న అతను పలువుర్ని ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం అతను ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు.
ఇలాంటి మాయగాళ్లు, మోసగాళ్లు మీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. జాగ్రత్త….

Related posts

ఆ అతిపెద్ద ‘రియాలిటీ డాన్స్ షో’లో పాల్గొనే మహిళా కంటెస్టెంట్ పై యాసిడ్ దాడి…కేసు నమోదు

chandra sekkhar

ఛత్తీస్ ఘడ్ లో నక్సల్స్ ఘాతుకం

admin

నల్లగొండ జిల్లా…దారుణం…ప్రేమకు బలైపోయిన యువకుడు…నరికి చంపిన మామ..

chandra sekkhar

Leave a Comment