telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ దర్శకుడు కోనవెంకట్ పై కేసు నమోదు

Kona-Venkat

ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్‌పై కేసు నమోదైంది. ఆయనపై నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. సినిమాకు కథ ఇస్తానని చెప్పి నగదు తీసుకుని మోసం చేశారంటూ జెమిని ఎఫ్‌ఎక్స్ సంస్థ డైరెక్టర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కథ ఇవ్వకపోగా, డబ్బు సైతం తిరిగి ఇవ్వకుండా తమనే బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద కోన వెంకట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts