telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

ఛత్తీస్‌గఢ్‌ పేపర్‌ మిల్లులో గ్యాస్‌ లీక్‌.. ఏడుగురు కార్మికులకు అస్వస్థత!

gas leakage company

ఏపీలో గ్యాస్ లీకేజ్ ఘటన ఆందోళనకు గురి చేస్తున్న తరుణంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మరో సంఘటన జరిగింది. రాయ్ గఢ్ లోని పేపర్ మిల్లులో ట్యాంక్ శుభ్రం చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టేట్లా గ్రామంలో ఉన్న శక్తి పేపర్‌ మిల్లు కొవిడ్‌-19 కారణంగా గత కొన్నిరోజులుగా మూతపడి ఉన్నది.

మిల్లును తెరిచే ప్రయత్నంలో శుభ్రపరిచేందుకు పలువురు కార్మికులను పురమాయించారు. బుధవారం రాత్రి పేపర్‌ వేస్ట్‌తో నిండివున్న ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్‌ లీకైంది. దాంతో శుభ్రపరిచే విధుల్లో ఉన్న ఏడుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని రాయ్‌గఢ్‌ ఎస్పీ సంతోష్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మిల్లుకు సమీపంలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించారు.

Related posts