telugu navyamedia
telugu cinema news trending

మీరనుకుంటున్నది మాత్రం కాదు… “ఫైటర్” టైటిల్ పై ఛార్మి ట్వీట్

Puri

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ముంబై నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఈ మూవీ రూపొందుతోంది. చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని షూటింగ్ ప్రారంభం నుంచే చెప్పుకుంటున్నారు. కాగా ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతున్న ఛార్మి తాజాగా ఓ ట్విస్ట్ ఇచ్చింది. అందరూ అనుకున్నట్లుగా ఈ సినిమా టైటిల్ ‘ఫైటర్’ కాదని చెప్పేసింది. ”పూరి గారు ఈ సినిమాకు ఎప్పుడో టైటిల్ ఫిక్స్ చేశారు. ‘ఫైటర్’ అనే టైటిల్ అందరూ చెప్పుకుంటున్నారు. కానీ అది మాత్రం కాదు. ఈ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే షూటింగ్ ప్రారంభించి.. అతి త్వరలోనే పూరిగారు ఈ మూవీ టైటిల్ ప్రకటిస్తారు” అని చెప్పింది ఛార్మి. దీంతో ఈ సినిమాకు ‘ఫైటర్’ టైటిల్ కాదనే విషయం కన్ఫర్మ్ అయింది. ఈ క్రమంలో చిత్రానికి ‘లైగర్’ అనే టైటిల్ పెట్టినట్లుగా మరో ప్రచారం జరుగుతోంది. మగ సింహం, ఆడ పులి సంతానమే ‘లైగర్’. వినడానికి ఆసక్తికరంగా ఉన్న ఈ టైటిల్ కన్ఫర్మ్ చేస్తారా? లేక ఇంకేదైనా ఉందా? అంటే వేచి చూడాల్సిందే మరి.

Related posts

నేటి నుండి .. ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ .. ఫీజుల జీవో .. 35వేల నుండి లక్షన్నర వరకు..

vimala p

త్వరలోనే రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు… ఛార్జీల మోత మోగనుందా ?

vimala p

పాఠశాలపై దాడి .. 28మృతి.. రెచ్చగొట్టొద్దు అంటున్న ట్రంప్..

vimala p